Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భర్త అమాయకుడు.. నిన్ను ఉంచుకుంటాను.. కాదంటే నీ మరిది ఎదుటే రేప్ చేస్తా : మాజీ కార్పొరేటర్ వేధింపులు

ఏలూరుకు చెందిన ఓ మహిళకు స్థానిక కార్పొరేటర్ ఒకరు పెడుతున్న లైంగిక వేధింపులు అన్నీఇన్నీకావు. నీ భర్త అమాయకుడు కాబట్టి నిన్ను ఉంచుకుంటాను. నాతో ఉంటే నీకు స్వర్గం చూపిస్తా అంటూ వేధించడమే కాకుండా.. తనకు ల

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (09:48 IST)
ఏలూరుకు చెందిన ఓ మహిళకు స్థానిక కార్పొరేటర్ ఒకరు పెడుతున్న లైంగిక వేధింపులు అన్నీఇన్నీకావు. నీ భర్త అమాయకుడు కాబట్టి నిన్ను ఉంచుకుంటాను. నాతో ఉంటే నీకు స్వర్గం చూపిస్తా అంటూ వేధించడమే కాకుండా.. తనకు లొంగకుంటే ఆస్తుల్లో చిల్లిగవ్వ కూడా రాదంటూ బెదిరించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఏలూరు తూర్పు వీధికి చెందిన ఒక వివాహిత భర్త అన్‌డెఫినెటెడ్‌ స్కిజోప్రీనియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మంచానికే పరిమితమై ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ కౌలూరి చంద్రశేఖర్‌ ఆ వివాహితపై కన్నేశాడు. ఆమె వెంటపడుతూ ఎప్పటి నుంచో నీపై కోరిక ఉంది తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. 'నీ భర్త అమాయకుడు కాబట్టి నిన్ను ఉంచుకుంటాను. నాతో ఉంటే నీ భర్తకు రావాల్సిన ఆస్తుల వాటాలను పెద్ద మనిషిగా ఉండి సక్రమంగా ఇప్పిస్తాను. లేదంటే నీకు చిల్లిగవ్వ కూడా దక్కనివ్వ'నంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటికీ లొంగక పోవడంతో ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. 
 
ఆ వివాహిత భర్త సోదరుడితో స్నేహం చేసిన మాజీ కార్పొరేటర్‌.. ఆ వంకతో ఇంటికి వెళుతూ వేధించడం మొదలు పెట్టాడు. దీనికి మరిది కూడా వత్తాసు పలకడంతో ఆమె పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో గత నెల 15న మాజీ కార్పొరేటర్‌ చంద్రశేఖర్‌ వివాహిత మరిదితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. 'ఏంటీ ఎంత చెప్పినా మాట వినవా. అందుకే నేరుగా వచ్చాం. నీ మరిది ఎదుటే నిన్ను రేప్‌ చేస్తా'నంటూ బలాత్కరించబోయాడు.
 
దిక్కులేని పరిస్థితుల్లో ఆ వివాహిత వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా రాజకీయ పలుకుబడిముందు పోలీసులు చేతులెత్తేశారు. చివరకు ఆ మహిళ.. మీడియాను ఆశ్రయించింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆ మహిళ వాపోతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం