Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సుముఖంగా లేదు: పురంధేశ్వరి

ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సుముఖంగా లేదు: పురంధేశ్వరి
, సోమవారం, 6 జులై 2015 (15:17 IST)
ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సుముఖంగా లేకపోయినప్పటికీ.. తమ ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తామని మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. ఆ సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
 
ఇకపోతే... వైకాపాకు గుడ్ బై చెప్పి టీడీపీ పార్థం తీర్థం పుచ్చుకోనున్న ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ధ్రువీకరించారు. హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కలిశారు. టీడీపీలో చేరే విషయంపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, త్వరలో టీడీపీలో చేరతానని వెల్లడించారు. 
 
జిల్లా జడ్పీ చైర్మన్ అయినప్పటి నుంచి బాలాజీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జడ్పీ చైర్మన్ విషయం వివాదాస్పదమైన సమయంలో పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం, తనకు అండగా నిలవకపోవడంతో బాలజీ ఆవేదన చెందారని, అందుకే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu