Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్లపల్లి జైలులో సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల కలకలం!: అక్బరుద్దీన్‌పై దాడి చేసిన..

చర్లపల్లి జైలులో సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల కలకలం!: అక్బరుద్దీన్‌పై దాడి చేసిన..
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:26 IST)
చర్లపల్లి సెంట్రల్ జైలులో మరోసారి సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల కలకలం రేగింది. గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న జైలులో రెండు రోజులుగా అధికారులు పలు బ్యారెక్‌లలో చేసిన తనిఖీల్లో సెల్‌ఫోన్‌లతో పాటు సిమ్‌కార్డులు బయటడినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో చర్లపల్లి జైలులో ఉన్న మహ్మద్ పహిల్వాన్ ఉంటున్న బ్యారెక్‌లో ఇవి దొరికినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు మాత్రం ధ్రువీకరించడంలేదు. గతంలో కూడా ఖైదీల వద్ద సెల్‌ఫోన్‌లు దొరికాయి. తాజాగా మరోసారి సెల్‌ఫోన్లు బయపడినట్టు వస్తున్న వార్తలకు పాత సంఘటనలు బలాన్ని ఇస్తున్నాయి. 
 
ఆర్నెళ్ల కిందట చర్లపల్లి జైలులో ఖైదీల వద్ద సెల్‌ఫోన్‌లు లభించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీలపై నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు బ్యారెక్‌లు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా కరడుగట్టిన నేరగాళ్లు ఉంటున్న బ్యారెక్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో అధికారులు జైలులోని అన్ని బ్యారెక్‌ను తనిఖీ చేశారు. ఒక బ్యారెక్ ఆవరణలో సెల్‌ఫోన్, సిమ్‌కార్డులు లభించాయి. జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతీరోజు బ్యారెక్‌లను తనిఖీ చేస్తుంటామన్నారు. 
 
ప్రహరీ సమీపంలో సెల్‌ఫోన్‌లు కనిపిస్తుంటాయని, బయటి వ్యక్తులు గోడపైనుంచి లోపలికి సెల్‌ఫోన్‌లు వేస్తుంటారని, అవి వెంటనే సిబ్బంది చేతికి చిక్కుతుంటాయన్నారు. పహిల్వాన్ ఉంటున్న బ్యారెక్‌ను ఆదివారం తనిఖీ చేయలేదన్నారు. ఆయన బ్యారెక్‌లో ఎలాంటి సెల్‌ఫోన్ దొరకలేదన్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu