Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య కృష్ణాష్టమి శుభాకాంక్షలు: దుష్టశిక్షణ.. శిష్టరక్షణ తప్పదు!

బాలయ్య కృష్ణాష్టమి శుభాకాంక్షలు: దుష్టశిక్షణ.. శిష్టరక్షణ తప్పదు!
, శనివారం, 5 సెప్టెంబరు 2015 (13:40 IST)
నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణాష్టమి సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పాపం ఎక్కువైతే భగవంతుడు వివిధ రూపాల్లో దుష్టశిక్షణ.. శిష్టరక్షణ చేస్తుంటారని బాలయ్య పేర్కొన్నారు. సమాజంలో హింస పెరిగినప్పుడు పాపాలు ప్రబలినప్పుడు భగవంతుడు ఇలా చేస్తాడని పురాణాలు చెప్పాయని బాలయ్య కృష్ణాష్టమి సందర్భంగా గుర్తు చేశారు. 
 
ఆధ్యాత్మికతకు ప్రసిద్ధిగాంచిన దేశంగా ఉన్న భారతదేశంలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని బాలయ్య అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి హిందూపురం నియోజకర్గ ప్రజల అభివృద్ధి కోసం బాలయ్య విశేషంగా కృషి చేస్తున్నారు. అక్కడ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో జిల్లాల్లోనే నెంబర్ వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu