Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబును కలిసిన తర్వాత వేధింపులు : కొత్తపల్లి గీత!

చంద్రబాబును కలిసిన తర్వాత వేధింపులు : కొత్తపల్లి గీత!
, శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత తనకు వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని అరకు వైకాపా ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును తాను అరకు సమస్యలపై కలిసిన మాట్లానట్టు చెప్పారు. అయితే, ఈ సమావేశం తర్వాత తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఫోన్ ఇంకెవరైనా ఎత్తితే మౌనమే సమాధానం అవుతోందని చెప్పారు. 
 
అదేవిధంగా ఫేస్‌బుక్ ఖాతాలో కూడా అసభ్యకరమైన సందేశాలు పోస్టు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే ఎంపీపై ఈ రకమైన మానసిక దాడి చేయాల్సిన అసవరం ఎవరికి ఉంటుందంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
 
వైఎస్సార్సీపీ నుంచి ఎవరైన బయటకు వస్తే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన దాడిని నేతలే చేయిస్తున్నారా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు చేయిస్తున్నారా? లేదా ఇంకెవరైనా ఆకతాయిలు ఈ పనికి పూనుకున్నారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. 

Share this Story:

Follow Webdunia telugu