ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్‌చార్జ్ మంత్రులు సరిదిద్దాలి : సీఎం చంద్రబాబు

ఠాగూర్
సోమవారం, 10 నవంబరు 2025 (16:39 IST)
టీడీపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేశారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుని సరిదిద్దాలని ఆయన సూచించారు. 
 
సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే ఎవరు తప్పు చేసినా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఇన్‌ఛార్జి మంత్రులు ఆ బాధ్యత తీసుకుంటారన్నారు. 
 
వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించానని కేబినెట్‌ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ పనితీరును సీఎంతోపాటు సహచర మంత్రులు ప్రశంసించారు. 
 
ఎర్రచందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్‌ కేబినెట్‌ భేటీలో పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments