Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంజెక్షన్ సైకో మళ్లీ సూది గుచ్చాడు :: జల్లెడ పడుతున్నారు: చినరాజప్ప

ఇంజెక్షన్ సైకో మళ్లీ సూది గుచ్చాడు :: జల్లెడ పడుతున్నారు: చినరాజప్ప
, ఆదివారం, 30 ఆగస్టు 2015 (15:00 IST)
ఇంజెక్షన్ సైకో మళ్లీ సూదితో గుచ్చాడు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిమోడిలో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై వెళుతుండగా, ఉన్మాది ఆ చిన్నారికి ఇంజక్షన్ చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా సదరు ఉన్మాది ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి ఇంజక్షన్ చేసి పారిపోతుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భయానక వాతావరణం నెలకొని ఉంది. ఈ జిల్లాలో ఇంజెక్షన్ సైకో బారిన పడిన వారు సుమారు 15 మంది వరకు ఉన్నారు. 
 
ఇదిలావుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్న సూదిగాడి ఉదంతంపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. ఇదే అంశంపై ఆయన వైజాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను భయపెడుతున్న సైకో కోసం జల్లెడ పడుతున్నామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామన్నారు. సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు మంత్రి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu